Anasuya: అప్పట్లో నా ఫేవరేట్ హీరో ఆయనే: యాంకర్ అనసూయ

Anasuya
  • అర్జున్ 'జెంటిల్ మేన్' సినిమా అంటే ఇష్టం
  • ఆ సినిమాతో ఆయనకి ఫ్యాన్ గా మారిపోయాను
  • మరిన్ని కీలకమైన పాత్రల్లో అనసూయ
యూత్ లో అనసూయకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగానే ఆమెకి వరుసగా సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఆమె అలవాట్లు .. అభిరుచులు .. అభిప్రాయాలు .. ఇష్టాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి అనసూయ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ఒక ప్రశ్నకి ఆమె స్పందిస్తూ .."శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'జెంటిల్ మేన్' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి నేను యాక్షన్ కింగ్ అర్జున్ కి అభిమానిగా మారిపోయాను. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాతో ఆయనంటే క్రష్ ఏర్పడింది. అప్పట్లో ఆయనకి నేను వీరాభిమానిని" అంటూ చెప్పుకొచ్చింది. ఆ మధ్య వచ్చిన 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా మంచి మార్కులు కొట్టేసిన ఆమె, అంతే ప్రాధాన్యతను కలిగిన మరికొన్ని పాత్రలను పోషిస్తోంది.
Anasuya
Arjun
Tollywood

More Telugu News