China: వుహాన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదీ.. వివరించిన భారతీయులు!

Indians in China says about Hubei circumstances
  • హుబేయ్‌లో పెరుగుతున్న అసింప్టమాటిక్ కేసుల సంఖ్య
  • అత్యవసర పనులకు తప్ప బయటకు రాని జనం
  • పరిస్థితులు మరీ అంత ఆశాజనకంగా లేవన్న భారతీయులు

కరోనా వైరస్ పురుడు పోసుకున్న వుహాన్‌ను కరోనా ఫ్రీగా చైనా ప్రకటించినప్పటికీ పరిస్థితులు మాత్రం భయంభయంగానే ఉన్నాయని అక్కడి భారతీయులు పేర్కొన్నారు. 76 రోజులపాటు కొనసాగిన లాక్‌డౌన్‌ను తాజాగా ఎత్తివేసినప్పటికీ పరిస్థితులు మాత్రం అంత ఆశాజనకంగా లేవని అంటున్నారు.

వ్యాధి లక్షణాలు బయటపడకున్నా కోవిడ్ రోగులుగా తేలుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడమే ఇందుకు కారణమని వివరించారు. చాలా మంది ఇంకా ఇళ్లకే పరిమితం అవుతున్నారని, నిత్యావసర సరుకుల కొనుగోలుకు, కార్యాలయాలకు వెళ్లేందుకు తప్ప మిగతా సమయాల్లో ఎవరూ బయటకు రావడం లేదని వివరించారు.

కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ కోవిడ్ రోగులుగా తేలుతున్న (అసింప్టమాటిక్) కేసులు చైనాలో ఇప్పటి వరకు 997 నమోదయ్యాయి. వీటిలో 599 హుబెయ్ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. దీని రాజధాని అయిన వుహాన్‌లోనే వైరస్ పురుడుపోసుకుంది. ఇక్కడ చిక్కుకున్న వారిలో 600 మంది భారతీయులను ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం వెనక్కి తీసుకురాగా, వివిధ కారణాలతో ఇంకా కొందరు అక్కడే ఉన్నారు.

ప్రస్తుతం అక్కడి పరిస్థితులను వివరించినది వారే. ఈ నెల 8న నగరంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో నెమ్మదిగా జనం రోడ్లపైకి వస్తున్నారు. అయితే, చెబుతున్నంత సాధారణంగా అక్కడి పరిస్థితులు లేవని, అత్యవసరాలకు తప్ప జనం బయటకు రావడం లేదని అక్కడి భారతీయులు వివరించారు. అసింప్టమాటిక్ కేసుల భయం జనాల్లో కనిపిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News