Train: లాక్ డౌన్ తర్వాత రైల్వే ప్రయాణికులు ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి!

Social Distancing Must for Train Passengers
  • 2 గంటల ముందే స్టేషన్ కు చేరాలి 
  • మాస్క్ లు, భౌతిక దూరం తప్పనిసరి
  • వైద్య పరీక్షల అనంతరమే ప్రయాణికులకు అనుమతి
ప్రస్తుతమైతే లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా మొత్తం నిలిచిపోగా, అందులో భాగంగా రైళ్లు కూడా స్టేషన్లకే పరిమితం అయ్యాయి. ఇక త్వరలో లాక్ డౌన్ ను తొలగించి, రైళ్లు నడిచేందుకు అనుమతులు లభిస్తే, రైళ్లలో ప్రయాణాలకు కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఈ మేరకు పలు రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తునిలోనూ ఇదే తరహా మాక్ డ్రిల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించారు.

రైలు ఎక్కాలంటే, ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టుగా కనీసం 2 గంటల ముందే స్టేషన్ కు రావాల్సి వుంటుంది. మాస్క్ లు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యమూ లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. ఇక బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలన్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ మేరకు రైల్వే స్టేషన్లలో ధర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Train
Lockdown
Mask
Health Test
Mockdrill

More Telugu News