Donald Trump: మేం ఎంత కష్టపడినా వీళ్లింతే!: మీడియాపై ట్రంప్ అసహనం

Trump fires on media as they ignores government effrorts
  • కరోనా కట్టడిలో తీవ్రంగా కృషి చేస్తున్నామన్న ట్రంప్
  • మరే దేశం చేయనన్ని టెస్టులు చేస్తున్నట్టు వెల్లడి
  • మీడియా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, అక్కడి మీడియాలోని మెజారిటీ వర్గానికి పొసగదన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

"కరోనాను అంతం చేసేందుకు మేం ఎంతో చేస్తున్నాం. ప్రపంచంలో మరే ఇతర దేశం నిర్వహించనన్ని కరోనా టెస్టులు చేపడుతున్నాం. కానీ ఈ మీడియా మాత్రం ఫిర్యాదులు చేయడం తప్ప మరే విధంగానూ స్పందించదు. మేం వెంటిలేటర్ల విషయంలో తీసుకున్న చర్యల్లోనూ మీడియాది ఇదే వైఖరి. ప్రభుత్వ చర్యలు బాగున్నాయని వాళ్లెప్పుడూ చెప్పరు. దుర్మార్గంగా దేనినో దానిని తప్పుపడుతూనే వుంటారు" అంటూ ధ్వజమెత్తారు.
Donald Trump
Media
Corona Virus
USA

More Telugu News