Trivikram Srinivas: ఫోన్లోనే ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ చెప్పేస్తున్న త్రివిక్రమ్

Ayinanu Poyiravale Hasthinaku Movie
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  • ఒక కథానాయికగా శ్రుతి హాసన్
  • ఎన్టీఆర్ సరసన నాయికగా రెండవసారి

త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. గతంలో 'అరవింద సమేత'  సమయంలో ఆయన ఎన్టీఆర్ తో ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ గురించి చర్చిస్తూ వచ్చాడట. అయితే ఈ సారి లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వారే ఉండిపోవలసి వచ్చింది.

దాంతో  తాజా చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ గురించి త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి ఎన్టీఆర్ కి వివరిస్తున్నాడట. ఎన్టీఆర్ సందేహాలను నివృత్తి చేస్తూ వెళుతున్నాడని అంటున్నారు. ఒక నెలలో స్కిప్ట్ లాక్ చేయవచ్చని చెబుతున్నారు. రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ, బిజినెస్ మేన్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందట. ఒక కథానాయికగా శ్రుతి హాసన్ కనిపించనుందని చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'రామయ్యా వస్తావయ్యా' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News