Jagan: రాష్ట్రానికి మంచి చేయమని ‘అల్లా’ను ముస్లింలు ప్రార్థించాలి : ఏపీ సీఎం జగన్

AP CM Jagan speech
  • రాష్ట్రం కోసం హిందూ, క్రైస్తవ సోదరులూ ప్రార్థించాలి
  • ‘కరోనా’ కట్టడికి పాటుపడుతున్న అందరికీ ధన్యవాదాలు
  • ప్రజలనుద్దేశించి ప్రసంగించిన జగన్
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజా రవాణా సౌకర్యాలు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ప్రజలనుద్దేశించి ఈరోజు ఆయన ప్రసంగించారు. గ్రీన్ జోన్ లో వ్యవసాయ పనులు, పరిశ్రమలు యథావిధిగా సాగుతాయని అన్నారు.

 రాష్ట్రంలో ‘కరోనా’ కట్టడికి పాటుపడుతున్న గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. రంజాన్ మాసం ప్రారంభమైందని, ముస్లిం సోదరులు తమ ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవడం మంచి విషయమని అన్నారు. రాష్ట్రానికి మంచి చేయమని ‘అల్లా’ను ప్రార్థించమని ముస్లిం సోదరులను కోరుతున్నానని, అదే విధంగా, హిందూ, క్రైస్తవ సోదరులను కూడా తమతమ దేవుళ్లను ప్రార్థించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
Jagan
YSRCP
Andhra Pradesh
Corona Virus

More Telugu News