Corona Virus: మరణాల్లో రికార్డు... దేశంలో ఒక్కరోజులోనే 60 మంది మృతి

Highest death toll in one day recorded in India
  • ఇప్పటివరకు 886 మరణాలు
  • దేశవ్యాప్తంగా 24 గంటల్లో 1,463 కొత్త కేసులు
  • మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28,380
భారత్ లో కరోనా వ్యాప్తి ఇప్పటికీ నియంత్రణలోకి రావడంలేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,463 కేసులు నమోదు కాగా, 60 మంది మృత్యువాత పడ్డారు. భారత్ లో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో ఇంతమంది మరణించడం ఇదే ప్రథమం. దాంతో దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 886కి పెరిగింది. కాగా, ఈ సాయంత్రానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరింది. ఇప్పటివరకు 6,362 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Corona Virus
Deaths
India
Positive Cases
COVID-19

More Telugu News