Anitha: సున్నాలు చుట్టడం జగన్ కు బాగా అలవాటైంది: అనిత

TDP leader Anitha fires on Jagan
  • అన్ని హామీలకు సున్నాలు చుడుతున్నారు
  • సున్నావ‌డ్డీ ద్వారా ప‌థ‌కం ప్ర‌కారం మ‌హిళ‌ల నోట్లో సున్నం కొట్టారు
  • డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఒక్కొక్క‌రికీ 10 వేలిచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చడం లేదని విమర్శించారు. అన్ని హామీలకు సున్నాలు చుట్టడం సీఎంకు అలవాటైందని అన్నారు. ఓ పథకం ప్రకారం సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళల నోట్లో సున్నం కొట్టారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 'సున్నాలేయ‌డం, ఇచ్చిన హామీల‌కు సున్నాలు చుట్ట‌డం అల‌వాటైన సీఎం గారూ! సున్నావ‌డ్డీ ద్వారా ప‌థ‌కం ప్ర‌కారం మ‌హిళ‌ల నోట్లో సున్నం కొట్టారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఒక్కొక్క‌రికీ 10 వేలిచ్చి మీ చిత్త‌శుద్ధి నిరూపించుకోండి' అని ట్వీట్ చేశారు.
Anitha
Telugudesam
Jagan
YSRCP

More Telugu News