Corona Virus: ఏపీ నుంచి తమిళనాడులోకి వెళ్లకుండా సరిహద్దుల వద్ద గోడలు!

In the wake of corona Tamilnadu state constructs walls in AP boarder
  • ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు
  • సరిహద్దుల్లో స్థానికులతో గోడలు కట్టించిన తమిళనాడు
  • మొత్తం మూడు మార్గాల్లో గోడల నిర్మాణం
‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ఓ నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో గోడలు కట్టింది. ఏపీ నుంచి ఎవరూ తమిళనాడులోకి వెళ్లకుండా ఉండేందుకని మూడు చోట్ల గోడలు కట్టించింది. ఒకటి.. చిత్తూరు సమీపంలోని తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాల్ రహదారిలో, మరోటి.. పలమనేరు  సమీపంలోని గుడియాత్తాం వెళ్లే రహదారిలో, ఇంకోటి..  బొమ్మసముద్రం వద్ద తమిళనాడు సరిహద్దులోను స్థానికులతో అక్కడి అధికారులు గోడలు కట్టించారు. ఈ విషయమై చిత్తూరు జిల్లా అధికారులు స్పందిస్తూ, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు.
Corona Virus
Tamilnadu
Andhra Pradesh
boarder
walls

More Telugu News