BCCI: చిన్న క్రికెట్ జట్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్!

BCCI offer to small cricket boards
  • క్రికెట్  సిరీస్ లపై కరోనా ఎఫెక్ట్
  • ఆదాయాన్ని కోల్పోతున్న పలు క్రికెట్ బోర్డులు
  • చిన్న జట్లతో మరిన్ని మ్యాచ్ లు ఆడతామన్న బీసీసీఐ
క్రీడారంగంపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని పోటీలు, టోర్నమెంట్లు ఆగిపోయాయి. చివరకు ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. ఇక క్రికెట్ విషయానికి వస్తే... సిరీస్ లు ఆగిపోవడంతో పలు దేశాల క్రికెట్ బోర్డులు ఆదాయాన్ని కోల్పోయి, ఆర్థికంగా డీలా పడిపోయాయి.

దీంతో ఆయా దేశాల బోర్డులకు ఆదాయం వచ్చే మార్గాలను బీసీసీఐ ప్రతిపాదించింది. కరోనా ప్రభావం ముగిసిన తర్వాత చిన్న జట్లతో మరిన్ని ద్వైపాక్షిక మ్యాచ్ లు ఆడతామని... తద్వారా నష్టాల్లో ఉన్న బోర్డులు ఆదాయాన్ని సంపాదించవచ్చని తెలిపింది. భారత్ లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడి నష్టాన్ని పూడ్చుకోవాలని సూచించింది.
BCCI
Corona Virus

More Telugu News