'గీత గోవిందం' బన్నీ చేయకపోవడానికి కారణం అదే
- భారీ విజయాన్ని సాధించిన 'గీత గోవిందం'
- గీతా ఆర్ట్స్ 2 పై నిర్మాణం
- కొత్త హీరోనే కరెక్ట్ అని చెప్పిన బన్నీ
ఈ సినిమా కథతో గీతా ఆర్ట్స్ కి దర్శకుడు పరశురామ్ వచ్చినప్పుడు, బన్నీ అక్కడే వున్నాడట. పరశురామ్ కథ వినిపించిన తరువాత, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాలో తను చేయాలని ముచ్చటపడ్డాడట కూడా. అయితే అంతకు ముందు 'సరైనోడు' వంటి మాస్ హిట్ ఇచ్చిన తను, ఆ వెంటనే ఇంతటి సున్నితమైన లవ్ స్టోరీ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడట. ఈ కథకు కొత్త హీరో అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్టుగా సమాచారం.