Revanth Reddy: ఓ కేసీఆర్ సారూ.. ఇప్పుడైనా కళ్లు తెరవండి: రేవంత్ రెడ్డి

KCR sir please open your eyes says Revanth Reddy
  • లాక్ డౌన్ తో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గడ్డుకాలం
  • రేషన్ కార్డులేక ప్రభుత్వ సాయానికి నోచుకోని వైనం
  • వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని  రేవంత్ విన్నపం
లాక్ డౌన్ కారణంగా ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కుటుంబాలు పూట గడవలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. రేషన్ కార్డు లేక 2 లక్షల మందికి సర్కారు బియ్యం, రూ. 1,500 ప్రభుత్వ సాయం అందడం లేదని అన్నారు. వీరందరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 'ఓ సీఎం సారూ, ఇప్పుడైనా కళ్లు తెరవండి' అని ట్వీట్ చేశారు. దీంతో పాటు ఆటో, క్యాబ్ డ్రైవర్ల దుస్థితిపై ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.
Revanth Reddy
Congress
KCR
TRS
Lockdown

More Telugu News