Harshavardhan: ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను: నటుడు హర్షవర్ధన్

Harshavardhan

  • ఒక దశలో బాగా లావైపోయాను
  • ప్రతి రోజు జిమ్ కి వెళ్లడం మొదలెట్టాను
  • హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయేదన్న హర్ష          

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ, చాలాకాలం క్రితం తన జీవితంలో ఎదురైన ఒక సమస్యను గురించి చెప్పుకొచ్చాడు. " అప్పట్లో నేను బాగా తినేసి లావై పోయాను. అందరూ కామెంట్స్ చేస్తుండటంతో, సన్నబడటం కోసం జిమ్ లో కసరత్తులు చేయడం మొదలెట్టాను. ప్రతిరోజు సాయంత్రం జిమ్ లో వర్కౌట్స్ చేసి ఇంటికొచ్చి పడుకునేవాడిని. ఆ సమయంలో ఫ్లాట్ లో నేను ఒక్కడినే ఉండేవాడిని.

తెల్లవారు జామున ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయేది. పల్స్ రేట్ పెరిగిపోతున్నటుగా అనిపించేది. కంగారు పడిపోయి హాస్పిటల్ కి వెళితే, అంతా నార్మల్ గా ఉందని చెప్పేవారు. తరచూ అలాగే జరుగుతోంది .. సమస్య తగ్గలేదు. దాంతో ఈ నరకం భరించడం నా వల్ల కాదని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాంటి పరిస్థితుల్లోనే నా సన్నిహితుడు సుధాకర్ బాబుగారు, నా దినచర్య ను గురించి అడిగి తెలుసుకున్నారు. నా సమస్యకి ప్రధాన కారణం వాటర్ తక్కువగా తాగడమేనని చెప్పారు. అప్పుడు గానీ నేను ఆ సమస్య నుంచి బయటపడలేదు" అని చెప్పుకొచ్చాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News