Varla Ramaiah: సీఎం గారు.. దివిసీమ ఉప్పెన సందర్భంగా చేసిన అంత్యక్రియల అనుభవాలను పరిగణనలోకి తీసుకోండి: వర్ల రామయ్య

Corona death funerals has to be done according to their customs suggests Varla to Jagan

  • కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో సంయమనం పాటించాలి
  • కుటుంబాల ఆచార వ్యవహారాలను గౌరవించాలి
  • మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి

ఏపీలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, మృతుల అంత్యక్రియల విషయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్య దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా ఓ సలహా ఇచ్చారు.

కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సంయమనం పాటించాలని వర్ల చెప్పారు. మృతుల కుటుంబాల ఆచార వ్యవహారాలను గౌరవించాలని అన్నారు. 1977లో దివిసీమ ఉప్పెన సందర్భంగా చేసిన అంత్యక్రియల అనుభవాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. మృతుల బంధువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని సూచించారు.

Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
Corona Virus
Funerals
  • Loading...

More Telugu News