Koratala Siva: విజయ్ దేవర కొండకు అండగా దర్శకుడు కొరటాల శివ, హీరో కార్తికేయ

Director Koratal Shiva and Hero Karthikeya supports Vijaya Devara Konda
  • మిడిల్ క్లాస్ ఫౌండేషన్ కు కార్తికేయ లక్ష రూపాయల విరాళం
  • ‘లవ్ యూ బ్రదర్..’ అంటూ కొరటాల ట్వీట్
  • నీకు తోడుగా నేనుంటాను. కుమ్మేద్దామన్న కొరటాల
‘కరోనా’ కట్టడి నేపథ్యంలో కొనసాగుతున్న లాక్ డౌన్  కారణంగా నిత్యావసరాలకు సైతం ఇబ్బంది పడే కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ భారీ సాయం చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈ ప్రకటన చేసిన కొంచెం సేపటికి ఆయనకు అండగా ఉంటామని టాలీవుడ్ నుంచి ముందుకొచ్చారు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, హీరో కార్తికేయ స్పందించారు. విజయ్ దేవర కొండ ఏర్పాటు చేసిన మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్) కు కార్తికేయ లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. విజయ్ దేవర కొండకు తోడుగా ఉంటానని కొరటాల శివ ఓ ట్వీట్ ద్వారా తన మద్దతు ప్రకటించారు. ‘లవ్ యూ బ్రదర్, పది మందికి తోడుగా ఉండే పనుల్లో నీకు తోడుగా నేనుంటాను. కుమ్మేద్దాం. మంచితో. త్వరలో కలుద్దాం’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Koratala Siva
Tollywood
Karthikeya
Hero
Vijaya devarakonda

More Telugu News