Narendra Modi: రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

PM Modi to talk Chief Ministers tomorrow via video conference
  • లాక్ డౌన్ నేపథ్యంలో మరోసారి సీఎంలతో ప్రధాని సమావేశం
  • దశలావారీగా లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై చర్చించనున్న మోదీ
  • మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలంటున్న పలు రాష్ట్రాలు
ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సీఎంలతో మోదీ సమావేశం కానుండడం ఇది మూడోసారి. కరోనా వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు, ఆంక్షల కొనసాగింపు, సడలింపు తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నారు.

దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే విషయంపై సీఎంలతో మాట్లాడే అవకాశం ఉంది. కాగా, కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్న అనేక రాష్ట్రాలు మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నాయి. దీనిపైనా మోదీ ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
Narendra Modi
Prime Minister
India
Chief Minister
Lockdown
Corona Virus

More Telugu News