రాష్ట్రపతి ఆదేశాలు... వందల కిలోమీటర్లు కారులో ప్రయాణించిన మహారాష్ట్ర. మేఘాలయ ప్రధాన న్యాయమూర్తులు!
- లాక్ డౌన్ కష్టం ఎవరికైనా ఒకటే
- బాంబే, మేఘాలయా హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు
- ఉన్న పళంగా బయలుదేరిన బిశ్వనాథ్ సోమద్దర్, దీపాంకర్ దత్తా
కోల్ కతాను వదిలి ప్రయాణం ప్రారంభించిన దీపాంకర్ దత్తా రేపు మధ్యాహ్నానికి ముంబై చేరుకోనున్నారు. మరోవైపు అలహాబాద్ నుంచి కోల్ కతా చేరుకున్న బిశ్వనాథ్ సోమద్దర్, రోడ్డు మార్గాన నేడు షిల్లాంగ్ కు చేరుకోనున్నారు. కాగా, రాష్ట్రపతి ఆదేశాల మేరకు గురువారం నాడు వీరు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.