Donald Trump: అనుకున్న పనే చేసిన డొనాల్డ్ ట్రంప్... మీడియా సమావేశానికి డుమ్మా!

Trump Didnot Attend Press meet in White House
  • పదేపదే నోరు జారుతున్న డొనాల్డ్ ట్రంప్
  • రెండు రోజుల నాటి క్రిమి సంహారిణుల వ్యాఖ్యతో విమర్శలు
  • శనివారం నాడు మీడియా ఎదుటకు రాని అమెరికా అధ్యక్షుడు
వైట్ హౌస్ లో నిర్వహిస్తున్న రోజువారీ మీడియా సమావేశాలతో సమయం వృథా కావడం మినహా, మరో మార్గం లేదని వ్యాఖ్యానించిన ట్రంప్, అనుకున్నంత పనీ చేశారు. శనివారం నాటి మీడియా సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. రెండు రోజుల క్రితం కరోనా రోగుల శరీరాల్లోకి క్రిమి సంహారిణులను ఎక్కిస్తే సరిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా, పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై ఆరోగ్య నిపుణులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు.

దీంతో ఓ వర్గం మీడియా తనకు వ్యతిరేకంగా మారిపోయిందని, కేవలం వ్యతిరేక ప్రశ్నలను అడిగేందుకే పరిమితమై, తాను చెప్పే వాస్తవాలను ప్రసారం చేయడం లేదని ట్రంప్ ఆరోపించారు. తన మీడియా సమావేశాలతో ప్రయోజనం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్నటి సమావేశానికి హాజరు కాలేదు. కాగా, పదేపదే ఆయన నోరుజారుతున్న కారణంగా, నష్టమే అధికంగా వాటిల్లుతోందని భావిస్తున్న వైట్ హౌస్ అధికారులు, మీడియాకు ట్రంప్ ను దూరంగా ఉంచితేనే మేలన్న నిర్ణయానికి వచ్చి, ఆయన్ను ఒప్పించారని తెలుస్తోంది.
Donald Trump
Media Meet
White House
Corona Virus

More Telugu News