Narendra Modi: ఢిల్లీ నుంచి దేశంలోని ప్రతి గల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు: మోదీ

modi in mann ki baat
  • చాలా మంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారు
  • కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి
  • ప్రజలు బాసటగా నిలిచారు
  • స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ ప్రజలు స్పందించారు 
కరోనా వంటి కష్ట సమయంలో చాలా మంది దాతలు పేదలకు అండగా నిలుస్తూ సాయం చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోజు ఆయన మన్‌ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు బాసటగా నిలిచారని మోదీ చెప్పారు. స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ ప్రజలు స్పందించారని, ఇప్పుడు కరోనా సృష్టించిన విలయాన్ని అధిగమించేందుకు అన్ని వర్గాల ప్రజలు కొత్త తరహా విధానాల వైపు మళ్లారని ప్రశంసించారు.

కరోనాపై పోరాటానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ నుంచి దేశంలోని ప్రతి గల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారని ఆయన చెప్పారు.
Narendra Modi
BJP
mann ki baat
Corona Virus
India

More Telugu News