Wriddhiman saha: క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఇంట్లోకి దొంగలు!

Theft Attempt in Cricketer Saha Home
  • పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో సాహా నివాసం
  • లాక్ డౌన్ తో ముంబైలోనే ఉండిపోయిన ఫ్యామిలీ
  • దొంగల రాకను గుర్తించి పట్టుకున్న స్థానిక బంధువులు
భారత స్టార్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంట్లో దొంగలు పడ్డారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి ప్రాంతంలో సాహా కుటుంబం నివాసం ఉంటోందన్న సంగతి తెలిసిందే. తరతరాలుగా ఆయన కుటుంబం నివాసం అదే. అయితే, అందరూ కలిసి ముంబైకి వెళ్లిన సమయంలో లాక్ డౌన్ మొదలవడంతో, సిలిగురిలో ఇంటికి తాళం వేసే ఉంది.

ఆపై నెల రోజులుగా అక్కడికి ఎవరూ వెళ్లలేదు. విషయాన్ని పసిగట్టిన చోరులు ఇంటిపై కన్నేశారు. తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లారు. అయితే, ఆ దగ్గరలోనే సాహా బంధువులు కొందరు నివాసం ఉంటున్నారు. వారు దొంగలను గమనించి, పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొంతకాలంగా తాము అక్కడికి వెళ్లకపోవడంతోనే చోరులు ఈ ప్రయత్నం చేసి, విఫలం అయ్యారని సాహా వ్యాఖ్యానించారు.
Wriddhiman saha
Cricketer
Theft
Siliguri
House

More Telugu News