Balakrishna: క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బందికి నిత్యావసరాలు అందించిన బాలకృష్ణ

Balakrishna distributes essentials to hospital staff
  • లాక్ డౌన్ నేపథ్యంలో సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ
  • ఆసుపత్రి ఆవరణలో భోజన ఏర్పాట్లు
  • లాక్ డౌన్ ముగిసేంత వరకు ఉచిత భోజనం
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తమ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, దివ్యాంగులకు, మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ప్యాక్ లను అందించారు.

తమ సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా ఈ ప్యాక్ లు అందించినట్టు బాలకృష్ణ తెలిపారు. కాగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలోని హాస్టల్ లో ఉంటున్న మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి, ఇతర సిబ్బందికి నిత్యం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు ఉచిత భోజన ఏర్పాట్లు ఉంటాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Balakrishna
Basavatarakam
Cancer Hospitals
Essentials
Lockdown
Corona Virus

More Telugu News