రాజస్థాన్ లో తినడానికి సరైన తిండి కూడా లేక అలమటిస్తున్న తెలుగు విద్యార్థులు... వీడియో ఇదిగో!
- మెడికల్ కోచింగ్ కోసం కోటా వెళ్లిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు
- లాక్ డౌన్ తో హాస్టళ్ల మూసివేత
- బిస్కెట్లు తింటూ కడుపు నింపుకుంటున్నామని ఆవేదన
లాక్ డౌన్ కారణంగా హాస్టళ్లు మూసివేయడంతో తినడానికి సరైన తిండి కూడా లేదని, బిస్కెట్లు తింటూ కడుపు నింపుకుంటున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ఇతర రాష్ట్రాలు కొన్ని తమ విద్యార్థులను స్వరాష్ట్రాలకు తరలించాయని, తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా తమను తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగు విద్యార్థులు ఓ వీడియో విడుదల చేశారు. అందులో పలువురు విద్యార్థినులు దీనంగా వేడుకోవడం కలచివేస్తోంది.