Nagarjuna: నేను కనుక పూరీతో ఇప్పుడు శివమణి సినిమా చేస్తే డైలాగులు ఇలా ఉంటాయి: వీడియో పోస్ట్ చేసిన నాగార్జున

Nagarjuna If I did the movie Shivamani now purijagans dialogues would be somewhat like this in
  • కరోనా నేపథ్యంలో శివమణి సినిమాలోని డైలాగులు వైరల్
  • మాస్కులు లేకుండా తిరుగుతున్న ప్రజలను హెచ్చరించిన శివమణి
  • భవిరి రవి మిమిక్రీ చేసిన వీడియో వైరల్
'ఒకవేళ నేను కనుక ఇప్పుడు శివమణి సినిమాలో నటిస్తే, కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌ రాసే డైలాగులు ఇలా ఉంటాయి' అంటూ సినీనటుడు నాగార్జున ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులను భవిరి రవి మిమిక్రీ చేసి మార్చేసి కొత్తగా వినిపించాడు.

శివమణి సినిమాలో పూర్ణా మార్కెట్‌లో నాగార్జున చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. పోలీసు పాత్రలో నటించిన నాగార్జున ఆ మార్కెట్‌లో రౌడీలపై పంచ్‌ డైలాగులు విసురుతాడు. ఆ డైలాగులనే మార్చి కరోనా వైరస్‌ జాగ్రత్తలను నాగార్జున వాయిస్‌లో రవి చెప్పాడు. ఈ వీడియోనే నాగ్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు.

'నా పేరు శివమణి.. నాకు కొంచం మెంటల్‌.. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగ.. సడన్‌గా కరోనా వచ్చింది మాస్కులు వేసుకోండి అంటే కష్టంగానే ఉంటది' అంటూ నాగార్జున ప్రజలకు వార్నింగ్‌ ఇస్తున్నట్లు ఉన్న ఈ వీడియో వైరల్‌ అవుతోంది.
Nagarjuna
Tollywood
Puri Jagannadh
COVID-19

More Telugu News