Akhila priya: కిషన్‌ రెడ్డి గారూ, వీరిపై కఠిన చర్యలు తీసుకోండి: టీడీపీ నాయకురాలు అఖిల ప్రియ

I request kishanreddy garu to kindly take strict action against them
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు చాలా ప్రమాదంలో ఉంది
  • ప్రతి రోజు మనుషులు చనిపోతున్నారు
  • ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు సభ నిర్వహించారు
  • పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు?
కరోనా విజృంభణ నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తూ వారు లాక్‌డౌన్‌ సమయంలోనూ సభలు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. కర్నూలులో వైసీపీ నేతలు నిర్వహించిన ఓ సభపై స్పందించిన టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ వైసీపీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖను కోరారు.

'కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు చాలా ప్రమాదంలో ఉంది.. ప్రతిరోజు మనుషులు చనిపోతున్నారు.. క్వారంటైన్‌కు వెళుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభను జరపడానికి నంద్యాల ఎంపీ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను'  అని అఖిల ప్రియ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు నిర్వహించిన ఓ సమావేశం ఫొటోను ఆమె పోస్ట్ చేశారు.
Akhila priya
Telugudesam
Kishan Reddy
Lockdown
Corona Virus

More Telugu News