Niveda Pethuraj: అందాల ఆరబోతకు సిద్ధమంటున్న నివేద పేతురాజ్

Niveda Pethuraj ready for exposing
  • తెలుగు .. తమిళ భాషల్లో చేస్తున్న నివేదా పేతురాజ్
  • త్రివిక్రమ్ గారు చాలా గ్లామరస్ గా చూపించారు  
  •  పాత్రకి తగినట్టుగా కనిపించడానికి సిద్ధమన్న నివేదా పేతురాజ్
తెలుగు .. తమిళ భాషల్లో నివేదా పేతురాజ్ వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. 'మెంటల్ మదిలో' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నివేదా, 'బ్రోచేవారెవరురా' సినిమాతో మరింతగా కుర్రకారును ఆకట్టుకుంది. ఇక ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలో ఆమె పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "తమిళంలో నేను ఇంతవరకూ చేసిన పాత్రల కారణంగా గ్లామరస్ గా కనిపించవలసిన అవసరం ఏర్పడలేదు. ఇక తెలుగులోను 'అల వైకుంఠపురములో' వరకూ నేను గ్లామరస్ గా కనిపించలేదు. త్రివిక్రమ్ గారు నన్ను చాలా గ్లామరస్ గా చూపించారు. పాత్రకి అవసరం అనుకుంటే అందాలు ఆరబోయడానికి నేను సిద్ధంగానే వున్నాను. అలా అని చెప్పేసి అందాలు ఆరబోస్తేనే అవకాశాలు వస్తాయని నమ్మే వ్యక్తిని కాదు నేను. పాత్రకి తగినట్టుగా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అంటూ మనసులోని మాటను చెప్పుకొచ్చింది.
Niveda Pethuraj
Actress
Tollywood

More Telugu News