North Korea: కిమ్‌కు చికిత్స కోసం ఉత్తర కొరియా వెళ్లిన చైనా వైద్యుల బృందం

China sends team to North Korea to advise on Kim
  • నిపుణులైన వైద్య బృందాన్ని పంపిన చైనా
  • అంతర్జాతీయ లయన్స్ విభాగం సీనియర్ సభ్యుడి నాయకత్వం
  • ఇప్పటికీ పెదవి విప్పని ఉత్తర కొరియా
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యంపై వస్తున్న వార్తలపై ఆ దేశం ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు, ఈ వార్తలను ప్రచురించిన సీఎన్ఎన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇంకోపక్క, దాయాది దేశం దక్షిణ కొరియా కూడా ఈ వార్తలను ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. అయితే, ఇప్పుడు కిమ్ ఆరోగ్యంపై అనుమానం తలెత్తేలా మరో వార్త ప్రచారం అవుతోంది.

కిమ్‌కు చికిత్స చేసేందుకు నిపుణులైన వైద్య బృందాన్ని ఉత్తరకొరియాకు చైనా పంపినట్టు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ లయన్స్ విభాగం సీనియర్ సభ్యుడి నాయకత్వంలో వైద్య బృందం చైనా నుంచి ఉత్తర కొరియా వెళ్లినట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.
North Korea
Kim Jong Un
China

More Telugu News