Corona Virus: కరోనా అప్ డేట్స్: ప్రపంచవ్యాప్తంగా లక్షా 90 వేలకు పైగా మరణాలు

World corona death toll raises
  • 26 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
  • అమెరికాలో 49 వేలకు పైగా మరణాలు
  • యూరప్ దేశాలు కరోనాతో కకావికలం
  • విలవిల్లాడుతున్న ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్
ప్రపంచదేశాల్లో కరోనా రక్కసి కరాళ నృత్యం కొనసాగుతోంది. గత డిసెంబరులో చైనాలో ఈ మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటివరకు 26, 98,733 మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడగా, 1,90,089 మంది మృత్యువాత పడ్డారు.

ఆసియాలో పుట్టిన ఈ వైరస్ భూతం అమెరికా తర్వాత యూరప్ దేశాలపై అధిక ప్రభావం చూపుతోంది. యూరప్ లో ఇప్పటివరకు కరోనాతో 1,16,221 మంది మరణించారు. అక్కడ 12,96,248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా తీవ్రస్థాయిలో ప్రభావితమవుతున్న దేశం అంటే అమెరికానే. ఆ దేశంలో 49,963 మంది కరోనా ధాటికి బలయ్యారు. ఇక అమెరికా తర్వాత ఇటలీలో 25,549 మంది మరణించగా, స్పెయిన్ లో 22,157, ఫ్రాన్స్ లో 21,856, బ్రిటన్ లో 18,738 మంది కన్నుమూశారు.
Corona Virus
World
Deaths
Positive Cases
China
USA

More Telugu News