Ram Gopal Varma: కిమ్ కంటే అతని సోదరి మరింత కిరాతకురాలు అని తెలుస్తోంది: వర్మ

Ram Gopal Varma responds on Kim Jong Un issue
  • ఉత్తర కొరియా నియంత కిమ్ ఆరోగ్యంపై కథనాలు
  • ప్రపంచానికి మొట్టమొదటి లేడీ విలన్ అంటూ వ్యాఖ్యలు 
  • జేమ్స్ బాండ్ కూడా రంగంలోకి దిగొచ్చన్న వర్మ 
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యస్థితి విషమంగా ఉందంటూ వచ్చిన కథనాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

"ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్ మరణిస్తే అతని సోదరి దేశ పగ్గాలు చేపడుతుందని అంటున్నారు. ఆమె అతనికంటే కిరాతకురాలు అని తెలుస్తోంది. గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ప్రపంచానికి మొట్టమొదటి లేడీ విలన్ వస్తోంది. అదే జరిగితే జేమ్స్ బాండ్ కూడా రంగంలోకి దిగొచ్చు" అంటూ ట్వీట్ చేశారు.

కాగా, కొన్నిరోజులుగా కిమ్ ఆరోగ్యస్థితిపై సీఎన్ఎన్ కథనాలు వెలువరిస్తోంది. కిమ్ కు ఏదన్నా జరిగితే ఆయన సోదరి కిమ్ యో జోంగ్ పాలనా పగ్గాలు అందుకుంటారని ప్రచారం జరుగుతోంది.
Ram Gopal Varma
RGV
Kim Jong Un
Kim Yo Jong

More Telugu News