Nara Lokesh: గతంలో పల్లెల సమగ్రాభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేశాను: నారా లోకేశ్

lokesh fires on villages in ap
  • పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే
  • గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు సేవ చేేశాను
  • పల్లెల సమగ్రాభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేశాను
  • ఉపాధి హామీ పథకంలో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచాం
పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ శాఖ మాజీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్లు చేశారు. 'స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన సందర్భంగా జరుపుకునే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే. గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు దక్కింది' అని లోకేశ్ ట్వీట్లు చేశారు.

'పల్లెల సమగ్రాభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేశాను. గ్రామాల్లో 24 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 32 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్వచ్ఛమైన తాగునీరు కోసం ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేశాం' అని లోకేశ్ చెప్పారు.

'ఉపాధి హామీ పథకంలో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచాం. గ్రామాల అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్న సిబ్బంది, అధికారులు, ప్రజలందరికీ నా అభినందనలు' అని తెలిపారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News