Narendra Modi: సర్పంచ్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

modi video conference with sarpanchs
  • సర్పంచ్‌లు పాల్గొనాలని పీఎంవో పిలుపు
  • 11 గంటలకు ప్రారంభం
  • పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా మోదీ సందేశం
  • కరోనాపై ఐక్యంగా పోరాడదామన్న మోదీ
దేశంలోని సర్పంచ్‌లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. దేశంలో కరోనా విజృంభణతో పాటు ఈ రోజు పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

'ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశంలోని సర్పంచ్‌లతో మాట్లాడతారు. అందరు సర్పంచ్‌లు దూరదర్శన్‌ ద్వారా ఈ సంభాషణను, సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ ఇంట్లో నుంచే చూడవచ్చు. మోదీతో మాట్లాడి తమ అభిప్రాయాలను పంచుకోవాలనుకున్న వారు దగ్గరలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి మోదీతో మాట్లాడొచ్చు' అని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కు ఓ లేఖ రాశారు. పంచాయతీ రాజ్‌లో పని చేస్తోన్న వారు తమ నిబద్ధతతో అందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారని చెప్పారు. ఐక్యంగా పనిచేస్తుండడం కరోనాపై పోరాటంలో మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు. ఐక్యతతో పోరాడి కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు.
Narendra Modi
Corona Virus
India

More Telugu News