Tigers: ఈ చిత్రంలో ఉన్న పెద్ద పులులు ఎన్ని?... మెదడును బద్దలు కొట్టే ప్రశ్నకు అమితాబ్ సమాధానం ఇది!

Wow Many Tigers in This Picture
  • ట్విట్టర్ లో ప్రశ్నను చూసిన అమితాబ్
  • 11 అని సమాధానం ఇవ్వడంతో మరోసారి వైరల్
  • 20 వరకూ ఉన్నాయంటున్న నెటిజన్లు
ఈ పజిల్ ఈనాటిది కాదు. చాలా రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నదే. ఈ చిత్రంలో ఉన్న పెద్ద పులుల సంఖ్య ఎంత? అన్నదే ప్రశ్న. చాలా మంది దీనికి సమాధానం కోసం జుట్టు పీక్కోవాల్సి వుంటుంది. చిత్రంలో నాలుగు పెద్దపులులు వెంటనే కనిపిస్తాయి. కాస్తంత జాగ్రత్తగా చూస్తే, మరో నాలుగు కనిపిస్తాయి. మిగతావాటిని వెతికి పట్టుకోవాలంటే మాత్రం బుర్ర వేడెక్కాల్సిందే.

ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వారి ముందుకు ఇదే పజిల్ మరోసారి వచ్చింది. ట్విట్టర్ లో దీన్ని చూసిన బాలీవుడ్ బిగ్ బీ, అమితాబ్ బచ్చన్, సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆన్సర్ ఇస్తూ, తనకు 11 టైగర్స్ కనిపించాయని చెప్పారు. ఇక నటి దియా మీర్జా తనకు ఏకంగా 16 పులులు కనిపిస్తున్నాయని సమాధానం పెట్టారు. ప్రాచీ దేశాయ్  కూడా అదే సమాధానం ఇవ్వగా, అజయ్ సింగ్ తనకు 18 పులులు కనిపించాయని సమాధానం ఇచ్చారు. మరికొందరు 20 కనిపిస్తున్నాయని అనడం గమనార్హం. ఇక ఎన్ని పులులను గుర్తించగలరో పరీక్షించుకోండి.
Tigers
Who Many Tigers
Picture
Puzzle
Amitabh Bachchan

More Telugu News