Trivikram Srinivas: ఎన్టీఆర్ స్క్రిప్ట్ పైనే దృష్టిపెట్టిన త్రివిక్రమ్!

Trivikram Srinivas Movie
  • త్రివిక్రమ్ - ఎన్టీఆర్ నుంచి మరో సినిమా
  • లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి
  • వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు  
ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాతో త్రివిక్రమ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నాడు. రాజకీయాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి, 'అయినను పోయిరావాలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ పైనే కొన్ని రోజులుగా త్రివిక్రమ్ కసరత్తు చేస్తూ వస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసిన ఆయన, బెటర్మెంట్ కోసం తుది మెరుగులు దిద్దుతున్నాడట. కీలకమైన సన్నివేశాలు .. ఆయా పాత్రల సంభాషణలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. తన మార్క్ కామెడీ .. ఎమోషన్ సీన్స్ ను ఆయన మరింత బలంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Trivikram Srinivas
Junior NTR
Tollywood

More Telugu News