Sonia Gandhi: కరోనా పేరుతో బీజేపీ వైరస్ లను విస్తరింపజేస్తోంది: సోనియాగాంధీ

Sonia Gandhi targets BJP
  • 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు
  • రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారు
  • కరోనా టెస్టులు చాలా తక్కువగా జరుగుతున్నాయి
బీజేపీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి పేరుతో ద్వేషం, మతతత్వమనే వైరస్ లను బీజేపీ వ్యాపింపజేస్తోందని విమర్శించారు. లాక్ డౌన్ కారణంగా దేశంలో 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారని ఆమె చెప్పారు. రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 7,500 ఆర్థిక సాయాన్ని కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కరోనా టెస్టులను కూడా మన దేశంలో చాలా తక్కువగా నిర్వహిస్తున్నారని... నాసిరకమైన పీపీఈ కిట్లను వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం గమనార్హం.
Sonia Gandhi
Congress
BJP
Corona Virus

More Telugu News