రాజమౌళిలో నచ్చిన విషయాలు .. నచ్చని అంశాలు ఇవే: కీరవాణి

Keeravani
  • రాజమౌళికి ఏకాగ్రత ఎక్కువ
  • ఆయనలో పట్టుదల పాళ్లు ఎక్కువ
  • చిన్నపిల్లల సినిమాలు చూస్తాడన్న కీరవాణి
తెలుగు తెరకి మరింత భారీతనాన్ని పరిచయం చేసిన దర్శకుడిగా రాజమౌళి కనిపిస్తారు. బలమైన కథాకథనాలకు అద్భుతమైన దృశ్యరూపాలను ఇవ్వడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాంటి రాజమౌళిని గురించి కీరవాణి మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా రాజమౌళికి పట్టుదల ఎక్కువ. ఒక విషయాన్ని మనసులో అనుకుంటే దానిని సాధించేవరకూ పోరాడుతూనే ఉంటాడు.

అలాగే రాజమౌళికి ఏకాగ్రత ఎక్కువ .. ఏ విషయాన్నైనా వెంటనే పట్టేస్తాడు. ఆ పనిని తాను ఎంత పెర్ఫెక్ట్ గా చేయగలననే దానిపైనే దృష్టి పెడతాడు .. ఆయనలో నాకు నచ్చే అంశాలు ఇవే. ఇక రాజమౌళి ఎక్కువగా చిన్నపిల్లల సినిమాలు చూస్తుంటాడు. కాస్త పరిణతి కలిగిన సినిమాలు చూడమంటూ వాటి పేర్లను సూచించినా పట్టించుకోడు. ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా ఓ పక్కకి వెళ్లి చిన్నపిల్లల సినిమాలు చూస్తూ కూర్చుంటాడు. ఆయనలో నాకు నచ్చని విషయం ఇదే" అంటూ నవ్వేశారు.
Go Back to Shorts
Rajamouli
Keeravani
Tollywood

More Telugu News