రూ. 2.32 లక్షల కోట్ల రుణ మొత్తం డిఫాల్ట్: సిబిల్ హెచ్చరిక
- చిన్న, మధ్యతరహా కంపెనీలపై కరోనా ప్రభావం
- ఇప్పటికిప్పుడు రుణాల చెల్లింపు కష్టమన్న సిబిల్
- ఆరు నెలల మారటోరియాన్ని కోరిన ఐబీఏ
ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. రుణ బకాయిలపై ఆరు నెలల మారటోరియం విధించాలని సూచించింది. దీంతో పాటుగా క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ను ప్రవేశపెట్టాలని, వన్‌టైమ్ రుణ పునర్వ్యస్థీకరణ పధకాన్ని కూడా అందుబాటులో ఉంచాలని సిఫార్సు చేసింది.