ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తండ్రి కన్నుమూత

Mithun father Basantakumar dies at 95
  • గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బసంత్‌కుమార్
  • లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన మిథున్‌ 
  • ముంబై వెళ్లేందుకు ప్రయత్నం
బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్‌ చక్రవర్తి తండ్రి బసంత్‌కుమార్ చక్రవర్తి (95) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం ముంబైలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఈ రోజు తెలిపారు. బసంత్‌కుమార్ కిడ్నీ సమస్యలతో బాధపడుతూ మరణించినట్టు ఆయన రెండో కుమారుడు నామాషి చక్రవర్తి తెలిపారు.

మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన మిథున్‌ ముంబై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బసంత్ కుమార్ మృతికి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రీతూపర్ణ సేన్ గుప్తా మిథున్‌ కుటుంబ సభ్యులకు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
Go Back to Shorts
Mithun Chakraborty
Basantakumar
Mumbai
Bengaluru

More Telugu News