Mumbai: మహారాష్ట్రను బెంబేలెత్తిస్తున్న కరోనా.. నేడు ఒక్క రోజే 18 మంది మృతి

18 covid patients dead in Maharashtra today
  • మృతుల్లో 10 మంది ముంబైకి చెందిన వారే
  • కొత్తగా 431 కేసుల నమోదు
  • 5,649కి పెరిగిన కరోనా నిర్ధారిత కేసులు
కరోనా మహమ్మారి మహారాష్ట్రను బెంబేలెత్తిస్తోంది. రోజులు గడుస్తుంటే పరిస్థితి అదుపులోకి రావాల్సింది పోయి మరింత ప్రమాదకరంగా మారుతోంది. నేడు ఒక్క రోజే ఏకంగా 18 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంతేకాదు, నేడు కొత్తగా మరో 431 కేసులు వెలుగుచూసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,649కి పెరిగింది. కరోనా బారినపడి ఇప్పటి వరకు 269 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఈ రోజు 67 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు 789 మంది కోలుకున్నట్టు అధికారులు తెలిపారు. నేడు మృతి చెందిన 18 మందిలో 10 మంది ముంబై నగరానికి చెందిన వారే కావడం గమనార్హం.
Mumbai
Maharashtra
Corona Virus
Corona deaths

More Telugu News