zoom app: జూమ్‌ యాప్‌ వాడిన ఇద్దరి డేటాను దొంగిలించిన హ్యాకర్లు

2 Kolkata Executives Using Zoom Get Ransomware Threats
  • కోల్‌కతాకు చెందిన ఫ్రొఫెషనల్స్ నుంచి డబ్బు డిమాండ్
  • బిట్ కాయిన్ల రూపంలో ఇవ్వాలని మెయిల్ చేస్తున్న నేరగాళ్లు
  • జూమ్ యాప్ భద్రం కాదని కొన్ని రోజుల క్రితమే చెప్పిన  కేంద్రం  
లాక్‌డౌన్ సమయంలో వీడియో సమావేశాలకు వేదికగా మారిన ‘జూమ్’  యాప్ సురక్షితం కాదని కేంద్ర హోం శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. జూమ్ వంటి యాప్‌ను అభివృద్ధి చేస్తే రూ. కోటి నజరానా ఇస్తామని కూడా కేంద్రం ప్రకటించింది. జూమ్‌ యాప్‌ ద్వారా సమావేశాలు నిర్వహిస్తే  సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటిని నిజం చేసేలా.. కోల్‌కతాకు చెందిన ఇద్దరు  ప్రొఫెషనల్స్‌ను హ్యాకర్స్‌ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఆ ఇద్దరి కంప్యూటర్ల  నుంచి డేటా దొంగిలించారు. అది తిరిగి ఇవ్వాలంటే  బిట్ కాయిన్స్ రూపంలో  డబ్బు  ఇవ్వాలని డిమాండ్  చేస్తూ ఈ మెయిల్స్‌ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే తస్కరించిన  డేటాను పూర్తిగా తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు.  బాధితుల ఫిర్యాదు ప్రకారం.. హ్యాకర్లు  వెయ్యి అమెరికా డాటర్ల బిట్‌ కాయిన్స్ కావాలని ఆడిగారు. ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగంతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా విచారిస్తోంది.
zoom app
executives
hacked
kolkata
Ransomware Threats

More Telugu News