Vijay: రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున తమిళ హీరో విజయ్ విరాళాలు

Tamili Hero Vijay contributes to two telugu states
  • ‘కరోనా’పై పోరాడుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు
  • రెండు రాష్ట్రాల సీఎంల సహాయనిధులకు విరాళం
  • పీఎం సహాయ నిధితో పాటు పలు రాష్ట్రాలకు విజయ్ విరాళాలు
‘కరోనా’ కట్టడికి పోరాడుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తమిళ హీరో విజయ్ తన వంతు సాయం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్స్ కు రూ.5 లక్షల చొప్పున ప్రకటించారు. కాగా, పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలతో పాటు తమిళనాడుకు రూ.50 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, కర్ణాటకకు రూ.5 లక్షలు, పాండిచ్చేరికి రూ.5 లక్షలు, ఫెప్సీకి రూ.25 లక్షలను విజయ్ విరాళాలుగా ప్రకటించారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరాటానికి విజయ్ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Vijay
Hero
Tamilnadu
Corona Virus
contribution

More Telugu News