Roja: సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తా: రోజా వార్నింగ్

Roja warns opposition cadre
  • నీళ్లు ఇచ్చామనే సంతోషంతో ప్రజలు నన్ను ఆహ్వానించారు
  • వాళ్లు పూలు చల్లుతారని ఊహించలేదు
  • నాపై బురద చల్లేందుకు  ప్రయత్నిస్తున్నారు
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై రోజా ఘాటుగా స్పందించారు. పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు.

 తన నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ లో కరెంట్, నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... గత ప్రభుత్వం వీరి కోసం ఏమీ చేయలేదని... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఆ సంతోషంతోనే ప్రజలు తనను ఆహ్వానించారని... అయితే వారు పూలు చల్లుతారని తాను ఊహించలేదని అన్నారు. వారు ప్రేమతో చేస్తున్న పనికి ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నానని చెప్పారు.

విపక్ష నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని చెప్పారు. సోషల్ మీడియా ఉంది కదా అని పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
Roja
YSRCP

More Telugu News