Chandrababu: జర్నలిస్టులూ, జాగ్రత్తగా ఉండండి.. వీటిని మీ సెల్‌ఫోన్లలో సేవ్ చేసుకోండి: చంద్రబాబు

  Dear media members you are the bridge between the Govt and people
  • జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాంటి వారు
  • కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది
  • కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాను
కరోనా విజృంభణ నేపథ్యంలో సేవలందిస్తోన్న జర్నలిస్టులు ఆ వైరస్‌ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు ఆ నగర అధికారులు ప్రకటించారు. మరోవైపు, చెన్నైలోనూ పలువురు జర్నలిస్టులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో వారికి జాగ్రత్తలు చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు ఫొటోలు పోస్ట్ చేశారు. 
                                                                                                                         
 'ప్రియమైన మీడియా ప్రతినిధుల్లారా.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీరు వారధిలాంటివారు. కరోనా నేపథ్యంలో మీతో పాటు మీ కుటుంబం పట్ల మీరు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. చాలా మంది జర్నలిస్టులకు కొవిడ్‌-19 సోకడం ఆందోళన కలిగిస్తోంది' అని ట్వీట్ చేశారు.

'యునిసెఫ్‌ మార్గదర్శకాలను అనుసరించి కరోనా విజృంభణ నేపథ్యంలో ఏమేం చేయాలో, ఏమేం చేయొద్దనే విషయాలపై నేను సూచనలు చేస్తున్నాను. దయచేసి ఈ జాగ్రత్తలను మీ సెల్‌ఫోన్లలో సేవ్‌ చేసుకోండి. పూర్తి జాగ్రత్తలు పాటించండి. జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కరోనా విజృంభణను ఎదుర్కోవచ్చని ప్రపంచానికి చాటి చెప్పండి' అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జాగ్రత్తలను తెలిపే పలు చిత్రాలను ఆయన పోస్ట్ చేశారు.
Chandrababu
Andhra Pradesh
media
COVID-19

More Telugu News