Mancherial District: పంట పొలాల్లో పులి సంచారం...ఆందోళన చెందుతున్న గ్రామస్థులు

Tiger moves in green fields at manchiryala district
  • మంచిర్యాల జిల్లా గోపాలరావుపేట గ్రామ శివారులో పరిస్థితి
  • వ్యవసాయ పనుల సీజన్‌ కావడంతో ఇబ్బంది
  • అటవీ శాఖకు సమాచారం
వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకునే సమయంలో పంట పొలాల్లో పులి సంచరిస్తుండడం అక్కడి వారిని హడలెత్తిస్తోంది. పనుల్లోకి వెళితే ఏ మూల నుంచి వచ్చి మీదపడి దాడి చేస్తుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాలరావుపేట గ్రామ శివారుల్లో పులి సంచరిస్తుండడం అక్కడి వారికి కంటిమీద కునుకును దూరం చేసింది.

నిన్నటి నుంచి పొలాల్లోనే పులి తిరుగుతుండడంతో పొలాల వైపు వెళ్లడానికే వారు భయపడుతున్నారు. అటవీ శాఖ సిబ్బందికి గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులిని బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో గ్రామస్థులు, చుట్టుపక్కల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Mancherial District
Tandur
gopalaraopeta
tiger

More Telugu News