Bandla Ganesh: త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉద్వేగభరిత ట్వీట్ కు బండ్ల గణేశ్ స్పందన!

Bandla Ganesh response to Trivikram Srinivas tweet
  • 21 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
  • ఎంతో గమ్మత్తుగా, ఉద్వేగంగా ఉందన్న త్రివిక్రమ్
  • మీ ప్రయాణం మరో 29 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించిన బండ్ల గణేశ్
మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినీ ప్రయాణంలో 21 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరిత ట్వీట్ చేశారు. 'ఈ ప్రయాణం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంతో గమ్మత్తుగా ఉంది. చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని ట్విట్టర్ ద్వారా తన మనసులోని భావాలను వెల్లడించారు.

దీనిపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందిస్తూ... ఇంకో 29 సంవత్సరాలు మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని, ఎందరికో చేయూతను ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Bandla Ganesh
Trivikram Srinivas
Tollywood

More Telugu News