చూస్తుంటే ఇది కూడా కరోనా వైరస్ లా వ్యాపిస్తోంది: కీరవాణి
- 'బీ ద రియల్ మ్యాన్' చాలెంజ్ స్వీకరించిన కీరవాణి
- సందీప్ వంగా నుంచి అందరికీ సోకుతోందని చమత్కారం
- తాను కూడా ఇతరులకు అంటిస్తున్నానంటూ ట్వీట్
దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసిన కీరవాణి, 'అప్పుడప్పుడు బీ ద రియల్ మ్యాన్' అంటూ పేర్కొన్నారు. చూస్తుంటే ఈ చాలెంజ్ కూడా కరోనా వైరస్ లా వ్యాపిస్తోందని చమత్కరించారు. సందీప్ వంగా నుంచి రాజమౌళికి సోకిందని, రాజమౌళి నుంచి తనకు, ఇతరులకు సంక్రమించిందని పేర్కొన్నారు. ఈ చాలెంజ్ ను తనవంతుగా నిర్వర్తించానని, ఆపై దర్శకుడు క్రిష్ కు, సంగీతదర్శకుడు తమన్ కు అంటిస్తున్నానని ఫన్నీగా కామెంట్ చేశారు.