Imran Khan: మోదీ ప్రభుత్వాన్ని కరుడుగట్టిన హిందుత్వ సర్కారుగా పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్

Imran Khan calls Modi government racist Hindutva government
  • కశ్మీర్ లో 8 నెలలుగా అమానవీయ లాక్ డౌన్ అంటూ ట్వీట్
  • కశ్మీరీలకు కనీస సౌకర్యాలు దూరం చేస్తున్నారంటూ ఆరోపణ
  • ఇప్పుడూ అదే నిర్ధారణ అయిందని వెల్లడి
లాక్ డౌన్ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యథావిధిగా భారత్ పై బురదజల్లే ప్రయత్నం చేశారు. గత 8 నెలలుగా కశ్మీర్ ప్రాంతంలో అమానవీయ రాజకీయ లాక్ డౌన్ కొనసాగుతోందని, ఇప్పటికీ అక్కడ వైద్య, ఆర్థిక, సమాచార వ్యక్తీకరణ, ఆహార సదుపాయాలు లేవని ట్విట్టర్ లో ఆరోపించారు. కరుడుగట్టిన హిందుత్వానికి ప్రతీకగా నిలిచే మతతత్వ మోదీ ప్రభుత్వం ఇప్పటి లాక్ డౌన్ లోనూ కశ్మీరీలకు కనీస సౌకర్యాలను దూరం చేస్తున్నట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.
Imran Khan
Narendra Modi
Jammu And Kashmir
Lockdown
Hindutva
Corona Virus
India
Pakistan

More Telugu News