Allu Arjun: ‘పుష్ప’లో రెండో హీరోయిన్‌ గా నివేదా థామస్‌!

Niveda thomas is going to play a role in pushpa movie
  •  బన్నీ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం
  • ఇప్పటికే ఓ హీరోయిన్‌గా రష్మిక మందన్న ఎంపిక
  • కరోనాతో నిలిచిన సినిమా షూటింగ్
‘అల వైకుంఠపురములో’ చిత్రంతో  భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప’ మూవీతో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఫస్ట్‌లుక్‌ను ఈ మధ్యే విడుదల దేశారు. దీనికి  భారీ స్పందన వచ్చింది. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రంలో మరో  హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మలయాళ నటి నివేదా థామస్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. నాని సరసన ‘జెంటిల్‌మన్’తో పాటు ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో ఓ హీరోయిన్‌గా నటించిన నివేదా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పుడు బన్నీతో కూడా నటించే అవకాశం కూడా అమెకు లభించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై సినిమా యూనిట్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా,  కరోనా లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.
Allu Arjun
pushpa
nivetha thomas
heroine
sukumar

More Telugu News