జూనియర్ ఎన్టీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన చిరంజీవి!

  • చిరంజీవికి 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ విసిరిన తారక్
  • బాలయ్య, నాగ్, వెంకటేశ్, చరణ్ లకు కూడా ఛాలెంజ్
  • 'ఇట్స్ మై ఛాలెంజ్' అన్న చిరంజీవి
తన ఇంటిని శుభ్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్... 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ ను తన బాబాయ్ బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రామ్ చరణ్, కొరటాల శివకు విసిరిన సంగతి తెలిసిందే. తారక్ విసిరిన ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. మీ పార్టనర్ రామ్ చరణ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పారు. ఇట్స్ మై ఛాలెంజ్ అంటూ 'ఛాలెంజ్' సినిమాలోని సన్నివేశాన్ని షేర్ చేశారు.

అంతకు ముందు ఈ సవాల్ ను తాకర్ కు రాజమౌళి విసిరారు. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన తారక్... 'మన ఇంట్లో ప్రేమలు,  ఆప్యాయతలనే కాదు పనులను కూడా పంచుకుందాం. వర్క్  లోడ్ ను షేర్ చేసుకోవడం ఫన్ గా ఉంటుంది' అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత టాస్క్ ను పూర్తి చేసి బాలయ్య, చిరంజీవి తదితరులకు సవాల్ విసిరారు.


More Telugu News

Chiranjeevi Junior NTR Be The Real Man Challenge tollywood