Ramcharan: ఇల్లంతా శుభ్రం చేసి.. భార్యకు కాఫీ పెట్టి ఇచ్చిన రామ్ చరణ్‌... వీడియో వైరల్

Lets take pride in doing chores at home ram charan
  • 'బీ ద రియల్ మ్యాన్' సవాలును స్వీకరించిన చెర్రీ
  • ఇంట్లో ఈ పనులు చేయడం పట్ల గర్వంగా ఉందని ట్వీట్
  • త్రివిక్రమ్, రణ్‌వీర్, రానా, శర్వానంద్‌లకు సవాలు  
సినీ దర్శకుడు వంగా సందీప్ విసిరిన 'బీ ద రియల్ మ్యాన్' సవాలును స్వీకరించిన డైరెక్టర్ రాజమౌళి తన ఇంటిని పరిశుభ్ర పరిచి సినీనటులు  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జూ.ఎన్టీఆర్ ఈ సవాలును స్వీకరించి ఇల్లు, వాకిలి శుభ్రం చేసి ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు. తాజాగా చెర్రీ కూడా సవాలు స్వీకరించాడు.

ఇల్లు శుభ్రం చేసి, బట్టలు పిండి, మొక్కలకు నీళ్లు పోసి, భార్య ఉపాసనకు కాఫీ పెట్టి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇంట్లో ఈ పనులు చేయడం పట్ల గర్వంగా ఉందన్నాడు. మహిళల వర్క్‌ లోడ్‌ను షేర్ చేసుకుని నిజమైన మగాడిలా ఉండాలని సూచించాడు. త్రివిక్రమ్, రణ్‌వీర్, రానా, శర్వానంద్‌లకు ఆయన సవాలు విసిరాడు.

Ramcharan
Tollywood
Lockdown

More Telugu News