Koratala Siva: జూనియర్‌ ఎన్టీఆర్‌ విసిరిన సవాలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు కొరటాల శివ

Koratala siva Challenge accepted tarak  annayya
  • 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్‌లో పాల్గొంటున్న సినీ ప్రముఖులు
  • సవాలును స్వీకరిస్తున్నాను తారక్ అన్నయ్య  
  • ఇప్పటికే నెల రోజుల ఫూటేజ్‌ మిస్ అయిందన్న కొరటాల  
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ తన ఇల్లు శుభ్రం చేసి ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ దర్శకుడు కొరటాల శివకు సవాలు విసిరిన విషయం తెలిసిందే. 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్‌లో పాల్గొనాలని, ఇంటిని శుభ్రం చేయాలని ఆయన చెప్పాడు. తారక్ విసిరిన సవాలుపై స్పందించిన కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'సవాలును స్వీకరిస్తున్నాను తారక్ అన్నయ్య.. ఇప్పటికే నెల రోజుల ఫూటేజ్‌ మిస్ అయింది' అంటూ కొరటాల శివ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు బంద్‌ కావడంతో సినీ రంగంలోని వారంతా ఇంట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో తాను గత నెల రోజులుగా ఇంట్లో పనులు చేస్తున్నట్లు, అయితే ఆ నెల రోజుల పనులకు సంబంధించిన వీడియోలు మాత్రం తీసుకోలేదని కొరటాల శివ చెప్పకనే చెప్పారు.
 
కాగా, దర్శకుడు రాజమౌళి ఇంటిని శుభ్రం చేసి తారక్, రామ్ చరణ్‌లకు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సవాలును స్వీకరించిన ఎన్టీఆర్‌.. కొరటాలతో పాటు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌కి ఈ సవాలు విసిరాడు.
Koratala Siva
Junior NTR
Tollywood
Lockdown

More Telugu News