Balakrishna: బాలయ్యతోనే పూరి తదుపరి సినిమా?

puri Jagannadh Movie
  • పూరి తాజా చిత్రంగా రానున్న 'ఫైటర్'
  • కొత్త కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ
  • గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పైసా వసూల్'
పూరి జగన్నాథ్ తాజా చిత్రంగా 'ఫైటర్' రూపొందుతోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే నిర్ణయంతో పూరి వున్నాడు. యూత్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత పూరి తదుపరి మూవీ ఏ హీరోతో వుండనుందనే విషయంపై అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో బాలకృష్ణతో 'పైసా వసూల్' చేసిన పూరి, తాజాగా బాలకృష్ణకి కాల్ చేసి కథ వినిపించాడట. కథలో కొత్తదనం కారణంగా వెంటనే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. 'ఫైటర్' పనులు పూర్తి కాగానే బాలకృష్ణ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా పూరి ప్లాన్ చేసుకుంటున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Balakrishna
Puri Jagannadh
Paisa Vasool Movie

More Telugu News